Comments on YS Jagan Govtసామెతలు ఉరకే పెట్టరు పెద్దలు అంటారు. కొన్ని కొన్ని సార్లు అచ్చు గుద్దినట్లుగా సరిపోతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలు కూడా అలాగే ఉంటున్నాయి. ఒక దానికొకటి పొంతన లేకుండా అసలు విషయాలను పక్కదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తూ ప్రజల దృష్టిలో నవ్వుల పాలవుతున్నారు.

ముఖ్యంగా ఇలాంటి ప్రకటనలు ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం పార్టీ వర్గీయులు మరియు జనసైనికులు ఈ అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హల్చల్ చేస్తున్నారు.

“గతంలో జిల్లాకో మెడికల్ కాలేజీ అని ప్రకటనలు చేసిన జగన్ సర్కార్, అవి పూర్తయ్యాయా? ఇపుడు జిల్లాకో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. పగటిపూట నిద్రపోతే ఇలాంటి కలలే వస్తాయి” అంటూ టిడిపి అభిమానులు అంటున్నారు.

“ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అంట… రోడ్లు వేయలేని అన్నియ్య , విమానాశ్రయాలు కట్టిస్తాడు అంట… కట్టేస్తే కట్టించావు కానీ, సినీమా టికెట్స్ లాగానే 10 రూపాయలు టికెట్స్ పెట్టి ప్లైట్ ఎక్కలనే పెద్దవాళ్ళ కోరికను తిర్చు అన్నియ్య…” అంటూ జనసైనికురాలు తనదైన శైలిలో వ్యంగంగా జగన్ తీరును ఏకరువు పెట్టారు.

ఇక నెటిజన్ల స్పందనైతే మాటల్లో చెప్పలేని రీతిలో జగన్ నిర్ణయాన్ని తూర్పార పడుతున్నారు. ఓ పక్కన పెరిగిన ధరలతో సామాన్యుడి జీవితం అస్తవ్యస్తంగా మారగా, వాటిని పట్టించుకోకుండా పన్నుల మీద పన్నులు వేస్తూ సామాన్యుల బతుకు బండిని మరింత ఛిద్రం చేస్తోన్న ఏపీ సర్కార్, కొత్తగా విమానాశ్రయాల గురించి చెప్పడం హాస్యాస్పదంగా మారింది.

ఇదంతా ఉద్యోగస్తుల పోరాటాన్ని ప్రతిపక్షాల నుండి పక్కదోవ పట్టించే ప్రకటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నిజంగా జగన్ కు విమానాశ్రయాల మీద అంత ప్రేమే ఉన్నట్లయితే, ముందుగా ఉన్న కొత్త వాటి సంగతి దేవుడెరుగు, ప్రస్తుతం ఉన్న వాటిని వాడుకలో తీసుకువస్తే సరిపోతుంది.

గతంలో చంద్రబాబు హయాంలో ఉన్న ఫ్లైట్స్ ను కూడా తన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి అలాంటి జగన్ ఒక్కసారిగా విమానాశ్రయాలు తెరపైకి తెచ్చారంటే గూడార్ధం ఏమిటో!?