YS Jagan Shaking Social Mediaవైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తణుకులో ‘వన్ టైం సెటిల్మెంట్’ పధకాన్ని సీఎం ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం గారు చేసిన ప్రసంగంలో మరోసారి తన తెలుగు వాక్చాతుర్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘సామాజిక అస… అసమతౌతుల్యం వస్తుందంట! కేవలం ఆరేడు సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వారువీరన్న తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ నుండి టైం పాస్ కు సోషల్ మీడియాకు వచ్చే నెటిజన్ల వరకు ఈ వీడియోను వీక్షించకుండా ఉండలేక పోతున్నారు.

అతి తక్కువ సమయం ఉండడం ఈ వీడియో వైరల్ కు మరో కారణం. అయితే ఇలాంటి తడబాటు వ్యాఖ్యలు చేయడం లేక మాటలు మాట్లాడడం ఏపీ సీఎంకు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాలలో జగన్ ఇలా తెలుగు చదవడంలో తడబాటుకు గురై, నెటిజన్ల సందడికి కారణమయ్యారు.

ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజుతో మొదలైన ఈ తెలుగు తడబాటు గత రెండున్నర్రేళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ఇలా జగన్ పలికిన అర్థరహిత మాటలను కూడా అంతేస్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉంటున్నారు. అయితే ఇది మాత్రం బర్త్ డే స్పెషల్ గా భావించాల్సి ఉంటుందేమో!