Central Finance Minister Nirmala Sitharamanపార్లమెంట్ వేదికగా వైసీపీ ఎంపీలు ఏపీ ఆర్ధిక స్థితిని వివరిస్తూ చేస్తోన్న ప్రకటనలతో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ స్థాయిలో రెవిన్యూ లోటు రావడానికి గల కారణాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.

2019-20లో రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణం కొత్తగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ వంటి పధకాలే కారణమని కీలక వ్యాఖ్యలు చేసారు. బడ్జెట్ లో పేర్కొన్న 1779 కోట్లకు మించి రెవెన్యూ లోటు ఈ కారణాలతోనే ఏర్పడిందని స్పష్టం చేసారు ఆర్ధిక మంత్రి గారు. 15వ ఆర్ధిక సంఘం పరిధిలోని 2020-21 రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేసినా, రెవిన్యూ లోటులో పెరుగుదల కనిపించినట్లు తెలిపారు.

అలాగే ఏపీకి 2014-15 నుండి 2021-22 వరకు గత ఎనిమిదేళ్ళల్లో పన్నుల వాటా క్రింద 4,40,985 కోట్లు ఆర్ధిక వనరులు అందించినట్లుగా నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి గానూ కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం వాస్తవిక ఆదాయాన్ని అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేసారు.