Jagan-Mohan-Reddy Fails to grab votesఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా అనుకూలతలను లెక్కించడానికి సర్వేలు చేస్తూ ఉంటారు. అయితే సర్వేలకు చాలా పరిమితులు ఉంటాయి. అవి అన్ని వేళల కరెక్ట్ అవ్వాలని లేదు. ఎందుకంటే సర్వే నిర్వహించేవారు ఏదో కొన్ని వందల మందితో మాట్లాడి అవి కోట్ల మంది అభిప్రాయంగా తీసుకుంటారు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సర్వేల కంటే ప్రజలు కొన్ని రకాలుగా తమ అభిప్రాయాన్ని తెలుపుతారు. అలాంటిదే ఇది. జగన్ ప్రభుత్వం ఇటీవలే ఓటీఎస్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. పదివేలు కడితే ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళ పై లబ్దిదారులకు పూర్తి హక్కులు వస్తాయి.

వారి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక్క విజయనగరం జిల్లాలో ఈ పథకం కింద ప్రభుత్వం 136.65 కోట్ల టార్గెట్ పెట్టుకుంది. అయితే తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్టర్ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ జిల్లాలో ఇప్పటివరకు ఈ పథకం కింద 12.35 కోట్లు వసూలు అయ్యిందట.

అంటే ప్రభుత్వ టార్గెట్ లో 10% కూడా అవ్వలేదు. ప్రభుత్వ ఇళ్ళ లబ్ధిదారులు అంటే సహజంగా ప్రభుత్వం నుండి ఉచిత పథకాలు అందుకునే వారే. వారిలోనే జగన్ ప్రభుత్వం పలుకుబడి ఈ రకంగా ఉందంటే ఎన్నికలలో ఇబ్బందే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వేల కంటే ఇటువంటి అధికారిక లెక్కలు మరింత ప్రామాణికం అని వారు అంటున్నారు.

మిగతా వర్గాలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా… లబ్ధిదారులు తమకే ఓటు వేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తూ ఉంది. వారిలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అనే అనుమానం మొదలయ్యింది. డబ్బులు అయితే తీసుకుంటున్నారు గానీ ఓట్లు వేస్తారనే నమ్మకం లేదా అనేది ఆలోచించాలి.