ఇలాంటివి తెలుగు తమ్ముళ్లు అస్సలు వదలరు!అధికారంలో జగన్ తీసుకునే నిర్ణయాలను ట్రోల్ చేయడం ఇటీవల కాలంలో తెలుగు తమ్ముళ్లకు పరిపాటి అయిపోయింది. అందుకు తగ్గట్లుగానే జగన్ తన పాలనను కొనసాగిస్తుండడం విశేషం.

అధికారం చేతిలో లేక మునుపు ‘మాట తప్పను, మడమ తిప్పను’ అనే స్లోగన్ తో ప్రజల్లోకి వచ్చిన జగన్, ఇపుడు అదే ప్రజల చేత ‘యు టర్న్ జగన్’ అనిపించుకుంటున్నారంటే ఏ విధమైన పాలన అందిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

Also Read – కూటమి ప్రాభుత్వం తాలూకా పాలన..!

ఇదే తెలుగు తమ్ముళ్లకు అవకాశంగా మారుతోంది. ఇటీవల టీవీ 5లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షో నిర్వాహకుడు జగన్ పాలనను అభివర్ణిస్తూ చేసిన కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు. ఎవరో ఒకరు తనకు సందేశం పంపించారని చెప్తూ షో నిర్వాహకుడు ఈ సందర్భంగా చదివి వినిపించారు.

పండగ చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా “జగనన్న వేడుక” క్రింద 5% కట్టాలి సార్!

Also Read – ఆ పధకానికి పరిమితులు అవసరమే… లేకుంటే భారమే

ఏ వాహనం కొనుక్కున్నా, అమ్ముకున్నా “జగనన్న వాహన మిత్ర” క్రింద 5% కట్టాలి సార్!

ఎవరు మంచాలు కొనుక్కున్నా, కంచాలు కొనుక్కున్నా, గరిటలు కొనుక్కున్నా, కుండలు కొనుక్కున్నా “జగనన్న వస్తు పధకం” 5% చెల్లించాలి సార్!

Also Read – అందుకే మేము ఓడిపోయి ఇక్కడ కూర్చున్నాము!

ఎవరు భూమిని అమ్మినా, కొన్నా, అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు “జగనన్న భూ పధకం” క్రింద 5% చెల్లించాలి సార్!

బట్టలు అమ్మినా, కొన్నా, చీరలు కట్టినా, లేకున్నా, పంజాబీ డ్రెస్ లు వేసుకున్నా, లేకున్నా, చీరలు కట్టిన వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకోనందుకు టాక్స్, పంజాబీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చీరలు కట్టలేదని టాక్స్, ఇలా 5% టాక్స్ కట్టాల్సిందే సార్!

ప్రజలు సుఖంగా నవ్వుతున్నారంటే, ఆనందంగా ఉన్నారు అంటే “జగనన్న సుఖీభవ” పధకం క్రింద 5% టాక్స్ కట్టాల్సిందే సార్!

వినడానికి, వీక్షించడానికి హాస్యాస్పదంగా ఉండడంతో, నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఇలాంటి వీడియోలను అస్సలు వదిలిపెట్టరు కదా!