Raghu-Rama-Raju “ఈ సారి చాలా గట్టిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడారు. గతంలో పార్లమెంట్ లో మాట్లాడింది కూడా చెప్పారు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయం కూడా తిరిగి పునరాలోచించాలని చెప్పారు. పోలవరం నిధుల విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసిందని” రేపు రాబోయే ‘సాక్షి’ పేపర్ లో సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించిన విషయాలు ఉంటాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ప్రధానితో భేటీ అనంతరం సహజంగా ఎవరైనా మీడియాతో మాట్లాడతారు, కానీ మా ముఖ్యమంత్రి మాత్రం మా బాకా పత్రికకు లీకులు ఇస్తారని సదరు అంశాలను స్పృశించారు. ఖచ్చితంగా సాక్షి ఇదే రాతలను రాస్తుందని, ఇందులో ఏ మాత్రం సందేహం లేదని అన్నారు. గతంలో బీజేపీని విమర్శిస్తూ మోడీని ఏకవచనంతో స్పందించిన జగన్, ఇపుడు అవే ప్రశ్నలు ప్రధాన మంత్రిని అడగాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

అర్ధాంతరంగా సీఎం ఢిల్లీ టూర్ పై స్పందిస్తూ, తాను బీజేపీలోకి చేరబోతున్నాను అనే వార్తలతో ‘మా ఎంపీని తీసుకోవద్దని’ చెప్పడానికి వచ్చారో లేక నేడు పలు పత్రికలు కూడా రాశాయి, విచారణ నిమిత్తం జగన్ కోర్టుకు హాజరయ్యే అంశంపై తీర్పు పెండింగ్ లో ఉంది గనుక, దానిపై కూడా వచ్చారేమో నాకు తెలియదు, అయితే బీజేపీకి కోర్టులకు సంబంధం ఏముందని, ఒక జడ్జ్ ఏడాది పాటు కూడా తీర్పును రిజర్వులో ఉంచవచ్చని, ఆ అధికారం జడ్జ్ కే ఉందని అభిప్రాయపడ్డారు.

విగ్రహాల విధ్వంసంపై స్పందిస్తూ… ఓ శిల్పి చెక్కినట్టు ఎన్టీఆర్ విగ్రహంపై సుత్తి పెట్టి కొడుతోన్న వాడిపై ఎటువంటి చర్యలు లేవు. దేవుడి విగ్రహాలను, దేవుడి లాంటి రామారావు లాంటి విగ్రహాలను ఇలా చేయడం దురదృష్టమంటూ పేర్కొన్నారు. ప్రజలలో చైతన్యం వస్తోందని, ఒక మహిళ మా పార్టీ భాషలోనే ‘ఒరేయ్ xxx’ అంటూ మమ్మల్ని తిట్టడం నన్ను షాక్ కు గురిచేసిందని అన్నారు.