Botsa Satyanarayana Comments AP capital as Hyderabadఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనా మొదటి రోజే అధికార – విపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది. వ్యవస్థల మీద జరిగిన దాడిగా గవర్నర్ ప్రసంగాన్ని అభివర్ణించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గవర్నర్ ప్రసంగం పై వ్యతిరేఖతను, ప్రభుత్వ తీరు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ టిడిపి సభ్యులు సభ నుండి వాకౌట్ చేసారూ.

రాజధాని పై హైకోర్టు ఇచ్చిన తీర్పుని విపక్షాలు స్వాగతించగా అధికార పక్షం మాత్రం మూడు రాజధాని నిర్ణయం పై మా మూడు మారలేదు అన్న చందం గా సందర్భం దొరికిన ప్రతిసారీ మీడియా సాక్షి గా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే వస్తుంది. అమరావతి కూడా మూడు రాజధానులలో ఒక భాగమే అని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం మంత్రి బొత్స రాజధానుల పై కీలక వ్యాఖ్యలు చేశారు.

2024 వరకు తెలంగాణలో ఉన్న హైదరాబాదే ఏపీ కూడా రాజధాని అని విచిత్రమైన వాదన తెర మీదకు తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వవం వచ్చిన తొలి నాళ్ళలోనే హైదరాబాద్ లో ఉన్న ఏపీ -తెలంగాణ ఉమ్మడి ఆస్తుల మీద పూర్తి హక్కుని తెలంగాణకే కట్టపెట్టిన విషయం మంత్రి గారు మర్చినట్టున్నారు అని ఆచర్యపోవడం ఏపీ ప్రజల వంతైంది. ఈ వాదనకు వ్యంగ్యంగా బదులిచ్చారు అచ్చెన్నాయుడు. అయితే వైసీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుండే తమ పరిపాలన కొనసాగించాలని చురకలు వేశారు.