కర్ణాటకలో త్వరలో జరిగే ఎన్నికలకు ఏపీ బీజేపీ నేతలు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, మాధవ్, మాజీ మంత్రి మాణిక్యాలరావు, సీనియర్ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ నేతలు కర్ణాటకకు బయలుదేరుతున్నారంట.
కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నేతలు ప్రచారం చేస్తారు. ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కీ రోల్ పోషిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఉట్టికి ఎగరని అమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉంది ఆంధ్ర బీజేపీ నేతల వ్యవహారం అని వారిని ఎద్దేవా చేస్తున్నారు.
“అసలు వీళ్ళు అందరు పొత్తులలో అవతల పార్టీ బలంతో గెలిచిన వారే. సొంతంగా గెలవలేరు గెలిపించలేరు అని ఇటీవలే కాకినాడ మునిసిపల్ ఎన్నికలలో కూడా చూశాం. వీళ్ళు వెళ్లి ప్రచారం చేస్తే ఆంధ్రకి బీజేపీ చేసిన అన్యాయం గుర్తొచ్చి వేసే వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వెయ్యడానికి ఆలోచిస్తారు,” అని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు.