Somu-Veerraju on YS Jagan Mohan Reddyరాయలసీమలో ఎయిర్ పోర్ట్… కడపలో ఎయిర్ పోర్ట్… ప్రాణాలు తీసేసే వాడి జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట్. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు… మేము ఎయిర్ పోర్టులు వేస్తాం – ఇది బిజెపి నేత సోము వీర్రాజు పలికిన పలుకులు. వివాదాస్పదంగా ఉన్న ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అధిష్టానం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయో ఏమో గానీ, ఇటీవల కాలంలో వైసీపీపై బీజేపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోన్న సోము, పార్టీ పగ్గాలు చేపట్టిన తొలినాళ్ళల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కానీ అమిత్ షా గత ఏపీ పర్యటన తర్వాత బిజెపి నేతల వైఖరిలో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. అధికార పక్షం చేస్తోన్న పరిపాలనను ఎండకడుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు బహిరంగ సభలు జరుగగా, రెండు సభల్లోనూ వైసీపీ పాలనపై బీజేపీ మండిపడింది.

ఈ దూకుడు మరింతగా ఎక్కువవుతోందని తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలే చెప్తున్నాయి. విమానాశ్రయాల సంగతి తాము చూసుకుంటాము, రాష్ట్రంలో రోడ్లు వేసుకుంటే చాలని జగన్ ను దెప్పి పొడిచారు సోము. ఎందుకంటే విమానాశ్రయాలను కేటాయించే అధికారం కేంద్రం చేతుల్లో ఉంటుందని తెలిపారు.

ఈ వ్యాఖ్యలతో వైసీపీ అండ్ కో సోము వీర్రాజుపై తీవ్రంగా మండిపడింది. వైసీపీ వారిని విమర్శిస్తే అరెస్ట్ లు చాలా సహజం అయిపోవడంతో, సోముని కూడా అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలపై ‘జగన్ అండ్ కో’ అరెస్ట్ ల దాకా వెళ్లకపోవచ్చనేది లేటెస్ట్ పొలిటికల్ టాక్.