Bandi Sanjay Kumar - Somu Veerrajuదుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఆరేళ్ళ పాటు తెలంగాణలో ఎదురు లేని తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. మరోసారి అటువంటి ఫలితాన్నే పునరావృతం చెయ్యడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుంది.

ఈ తరుణంలో హైదరాబాద్ లో హిందీ వారిని ఆకట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలలోని ప్రముఖ నేతలను, కేంద్ర నేతలు ప్రచారానికి తెస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వచ్చి వెళ్లారు. కర్ణాటకకు చెందిన తేజస్వి సూర్య కూడా హైదరాబాద్ లో హడావిడి చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీలోని చాలా స్థానాలలో ఆంధ్రకు చెందిన వారు ప్రభావితం చేస్తారు.

అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్క బీజేపీ నాయకుడిని కూడా తెలంగాణకు తెచ్చి ప్రచారం చేయించే సాహసం చెయ్యడం లేదు. అంటే తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలకు అదే ప్రాంతానికి చెందిన వారిపై పట్టు లేదనే కదా తెలంగాణ బీజేపీ నేతల ఉద్దేశం. పట్టులేకపోయినా ప్రచారం అయితే చేయించొచ్చు. అలా చేయించడం లేదంటే వారు వస్తే తమకు నెగటివ్ అని భావిస్తున్నారా?

అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ వారు చెబుతున్నట్టుగా వారి పరిస్థితి ఏమీ మెరుగుకానట్టే కదా? మరి వారేమో ఏకంగా మేమే ప్రత్యామ్న్యాయం మేమే అధికారంలోకి వస్తాం అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు కదా? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ భవిష్యత్తు జనసేన మీద ఆధారపడాల్సినట్టు ఉంది.