narendra-modi-changes-style-stops-chandrababu-naidu-bashingప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆయన ఆంధ్రకు రావడం ఇది రెండో సారి. ప్రధాని పర్యటన సందర్భంగా ఏపీలో నిరసనలు మిన్నంటాయి. అయితే ఆశ్చర్యకరంగా మీటింగుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అమరావతి మీటింగులో మొదటి వరస కూర్చీలు మాత్రమే నిండాయి. వెనుక మొత్తం ఖాళీ. అవి టీవీలలో రాకుండా రాష్ట్ర బీజేపీ నేతలు చాలానే కష్టపడాల్సి వచ్చింది. అయితే విశాఖపట్నంలో పరిస్థితి కొంత మెరుగయ్యింది.

దీనికి కారణం పుల్వామాలో ముష్కరుల దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత్ చేసిన దాడి వల్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దాడి ఎఫెక్ట్ ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ఘటనతో దేశవ్యాప్తంగా దేశభక్తి పెల్లుబిక్కుతుంది. ఈ ఉదంతాన్ని ప్రభుత్వం బానే హేండిల్ చేసిందని, పాకిస్తాన్ కి గట్టిగానే సమాధానం చెప్పింది అనే అభిప్రాయం ఉండడం వల్లే జనాలు బాగా వచ్చారని విశ్లేషకుల అంచనా. బీజేపీ బాగా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే ఆ ప్రభావం ఉంటే దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ ఉండొచ్చు.

ఇది ఎన్నికలలో ఉపయోగపడితే బీజేపీ మరొక సారి సొంతంగా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వచ్చే వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఏప్రిల్ – మే లో జరిగే ఎన్నికల గురించి ఇప్పటినుండే అన్ని వర్గాలలోనూ ఆసక్తి ఉంది. ప్రతిపక్షాల అశక్తత, ఈ వ్యవహారంలో వచ్చిన మైలేజ్ కారణంగా తిరిగి వస్తాం అని కమలనాథులలో అంచనాలు ఉన్నాయి. మోడీ అయితే ఈ పాటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు. సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నా ప్రచారం ఆపకపోవడం విశేషం.