kanna-lakshmi-narayana-comments-on-chandrababu-naiduరాష్ట్ర బీజేపీ నేతలు మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వామి భక్తి ప్రదర్శించడంలో సొంత రాష్ట్రం గొంతుకోస్తున్నారు. అసలు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన చెప్పలేదని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆనాడు తిరుపతి సభలో చెబితే.. ప్రత్యేక హోదా కల్పిస్తామన్నట్లు మోదీ ప్రసంగాన్నే మార్చేసి అబద్ధాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారని ఆయన ఆరోపించారు.

“ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మొదటి నుంచి ప్రధాని చెబుతున్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు సైతం సై అన్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారు,” అని ఆయన చెప్పుకొచ్చారు. మరి రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే 10 ఏళ్ళు కావాలని అడిగింది ఎవరు? ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది వాస్తవం కాదా? ఇప్పుడు ఎవరి మెప్పు కోసం ప్రజలను మోసం చెయ్యడానికి బయలుదేరుతున్నారు? మరోవైపు ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని కన్నా సిద్ధం అవుతున్నారు.

ఫిబ్రవరి 4న పలాసలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. బస్సుయాత్ర శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభమై కర్నూలు జిల్లా ఆదోనిలో ముగియనుంది. 15రోజుల్లో 85 నియోజకవర్గాల మీదగా కొనసాగనున్న బస్సుయాత్ర సాగనుంది. బస్సుయాత్రలో భాగంగా జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలో ఒక్కో కేంద్ర మంత్రులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధిష్టానం చెబుతోంది. ప్రజలను మోసం చేస్తూ యాత్రలు చేపడితే ఉపయోగం ఏమన్నా ఉంటుందేమో వారే ఆలోచించుకుంటే మంచిది.