Andhra Pradesh - BJPఒకప్పుడు ప్రముఖ సెఫాలజిస్ట్ గా పని చేసి ఆ తరువాత బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా మారిన జీవీఎల్‌ నరసింహరావు ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టే వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నరని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.

పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు. ఓటింగు శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది బుజు పట్టిన సిద్ధమని నరసింహారావు వంటి సెఫాలజిస్ట్ తెలియకపోవడం విశేషం. ఇటీవలే తెలంగాణ ఎన్నికలలో కూడా ఇటువంటి లెక్కలే వెయ్యగా తెరాస మళ్ళీ భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది.

ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ పెర్ఫార్మన్స్ గురించి జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఖాతా తెరిచే పరిస్థితి లేదు ఆ పార్టీకి, సీట్ల సంగతి పక్కన పెడితే కనీసం గుప్పెడు సీట్లలో డిపాజిట్లు కూడా దక్కడం కష్టం. దాని గురించి బాధ లేదు ఎంతసేపు చంద్రబాబు ఓడిపోవాలి… ఓడిపోవాలి… ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగడం లేదు అంటే ఎందుకు ఎదుగుతుంది? మే 23 తరువాత వారికి వచ్చే ఫలితాలు చూసైన సిగ్గు పెడతారేమో చూడాలి