Andhra Pradesh behind telangana in treating Coronavirus casesరెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. నిన్న రాత్రి విడుదలైన మెడికల్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో 592 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో కాసేపటి క్రితం విడుదలైన ఆంధ్రప్రదేశ్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో 473 కేసులు వెలుగు చూశాయి.

అయితే రికవర్, డిశ్చార్జ్ కేసులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే చాలా వెనుకబడి ఉందనే చెప్పుకోవాలి. తెలంగాణలో ఇప్పటివరకు 103 మంది కోలుకుని, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఖ్య కేవలం పద్నాలుగుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో వందకు పైగా కేసులు (109) నమోదు అయ్యాయి. 91 కేసులతో కర్నూల్ రెండవ స్థానంలో ఉంది. మరోవైపు… తెలంగాణలో జీహెచ్ఎంసి ఏరియాలో అత్యధికంగా 213 కేసులు ఉన్నాయి. రెండు రాష్ట్రాలలో అత్యధిక కేసులు ఢిల్లీలోని జమాత్ కార్యక్రమానికి సంబంధించినవే.

ఇది ఇలా ఉండగా… భారత్ లో కరోనా కేసులు 10,000 మార్కుని దాటేశాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 10,363 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో పదో వంతు అంటే వెయ్యికి పైగా కేసులు డిశ్చార్జ్ కావడం ఉపశమనం కలిగించే విషయం.