Nara-Lokesh About Andhra Pradeshఎన్నికల ప్రచారంలో పార్టీలిచ్చే హామీలు ప్రజలకు సంపద సృష్టించుకునే మార్గాలుగా ఉండాలే తప్ప., ప్రజలను సోమరిపోతులుగా మార్చే విధానాలుగా ఉండకూడదనేది సామాజిక వేత్తల అభిప్రాయం. ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా మన కళ్ళ ముందు కనపుడుతున్న సత్యమే ఈ నాయకత్వ లోపం.

ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, త్వరలో ఏపీ కూడా మరో శ్రీలంకలా మారనుందని.., ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలసీల వలన రాష్ట్రంలో సంపద సృష్టి జరగటం లేదని., సంపద సృష్టి లేకపోతే భవిషత్ కి భరోసా ఉండదని., తద్వారా జరిగేది ఆర్ధిక సంక్షోభమే అంటూ జగన్ తీరును నారా లోకేష్ తప్పుపట్టారు.

“పంచుకుంటూ పోతే… పెరుగుతూ పోతాయి” అంటూ జగన్ తాయిళాయిల రూపంలో ప్రజలకు పంచుతున్న కరెన్సీ గురించి., అలా పంచడానికి ప్రజలపై మోపుతున్న పన్నుల భారాన్ని గురించి ప్రజలకు అర్ధమయ్యే విధంగా లోకేష్ వివరించారు. ప్రజలు కూడా అలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని, లేకపోతే భవిషత్ అంధకారమవుతుందని హెచ్చరించారు.

అమ్మ ఒడి కోసం… నాన్న బుడ్డి., జగనన్న చేయుత అంటూ ఆటో సోదరులకు ఇచ్చే మొత్తాన్ని… ఫైన్ ల రూపంలో వెనుకకు తీసుకోవడం., పేదలకు ఉచిత పథకాలంటూ… చెత్త మీద పన్నులు వేయడం ఇలా ఒక వైపు పంచుకుంటూ…. మరో వైపు పెంచుకుంటూ పోతున్న జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు లోకేష్.

రాజధాని వికేంద్రీకరణ అంటూ రాష్ట్రాన్ని జగన్ విచ్ఛినం చేసాడు., అభివృద్ధి చేయటం చేత కాక మాటలతో కాలయాపన చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారని లోకేష్, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే సాయిరెడ్డి అక్రమాలతో విశాఖ వాసులు కంగారు పడుతున్నారని., ఇక జగన్ కూడా అక్కడికి వెళ్తే విశాఖ ప్రజలు వలస పోతారని వాపోయారు.

రాష్ట్రంలో ఒక్క వ్యవస్థ పనితీరు కూడా సరిగాలేదంటూ.., ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దీన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు. రోడ్ల మీద ఉన్న మూడు గుంతలను కూడా ఫుడ్చలేని మీరు మూడు రాజధానులు కడతారా? అంటూ ప్రశ్నించారు టీడీపీ ఎంపీ కేశినేని.

రోడ్డు, రవాణా వ్యవస్థ సరిగా లేదు, రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయింది., ఇసుక అందుబాటులో లేదు., కల్తీ మద్యం ఏరులై పారుతుంది., నూతన కట్టడాల మాటే లేదు., విద్యా వ్యవస్థను మట్టుపెట్టారు., ఆరోగ్య శ్రీ ఊసేలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో వ్యవస్థల ధ్వంసం జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటూ మండిపడ్డారు టిడిపి నేతలు.

ఇదే విధంగా వ్యవస్థలను నాశనం చేస్తే “ఏపీ కూడా మరో శ్రీలంక”లా మారుతుందని, వినియోగదారుని కొనుగోలు శక్తి తగ్గితే సంపద సృష్టి తగ్గిపోతుందని తద్వారా వచ్చేది ఆర్థిక విధ్వంసమేనని, ఇప్పటికే రాష్టంలో ఎన్నో వ్యవస్థలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియచేశాయని లోకేష్ తీవ్రస్థాయిలో స్పందించారు.

ఆశా వర్కర్స్., నిరుద్యోగ యువత., ప్రభుత్వ ఉద్యోగులు.,భవన నిర్మాణ కార్మికులు., నాటు సారా కాటుకు బలైన పేదలు., తమ స్కూల్స్ ని రక్షించుకునేందుకు విద్యార్థులు., మరి ముఖ్యంగా ఇప్పటికి రోడ్డు మీదే ఉన్న రాజధాని గ్రామస్తులు., కొత్తగా పారిశుధ్య కార్మికులు అంటూ లోకేష్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం గురించి ప్రజలకు వివరించారు.