Thammineni Seetharam COVID 19ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఆయన సతీమణికి కరోనా సోకిందని వార్తలు వస్తుంది. వారిద్దరినీ శ్రీకాకుళంలోని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్పీకర్ కు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. అయితే ఈ తరుణంలో కూడా తమ్మినేని పై విమర్శలు వస్తున్నాయి.

గతంలో కరోనా కారణంగా అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేస్తే అప్పట్లో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ కూడా కరోనా కారణంగా ఎన్నికలు వేయిదా వేశారా? లేక కమ్మరోనా కారణంగా ఎన్నికలు వేయిదా వేశారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనితో ఇప్పుడు స్పీకర్ కు సోకింది కరోనా నా? కమ్మరోనా నా? అంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో ఉండగా ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యడం తప్పే కానీ కరోనా పట్ల రాజకీయ నాయకులు నెగ్లిజెంట్ గా ఉంటే వారికి వారితో పాటు ప్రజలకు కూడా ప్రమాదమే అనడానికి ఇది ఉదాహరణ.

నాయకులు చేసే ఇటువంటి వ్యాఖ్యల కారణంగా ప్రజలు కూడా పరిస్థితిని సీరియస్ గా తీసుకోకుండా కేసులు పెరగడానికి కారణం అవుతారు. ఏది ఏమైనా స్పీకర్, ఆయన సతీమణి తొందరగా కరోనా నుండి కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని మనందరం దేవుడిని కోరుకుందాం!