Andhra Pradeash Assembly Passes Reservations Billsఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎప్పటినుండో రగులుతున్న కాపు రిజర్వేషన్ల సమస్యను పరిష్కరిస్తూ వారికి 5% రిజర్వేషన్లు ప్రతిపాదించారు. ఈ 5% తో మొత్తం రిజర్వేషన్లు నిర్ణీత 50% దాటడంతో కేంద్రం ఆమోదం తప్పనిసరి. ఇక ఈ బిల్లుకు కేంద్రం దగ్గర ఆమోదం లభించాల్సి ఉంది.

త్వరలోనే ఈ బిల్లును ఏపీ సర్కార్ కేంద్రానికి పంపనుంది. మరోవైపు బోయ, వాల్మీకి తెగలను షెడ్యూల్డ్ తెగల జాబితాను కలపాలని నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన బిల్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు. బిల్ పాస్ అయ్యింది కూడా. దీనిని కేంద్రం ఆమోదించాలి. అయితే ఆల్రెడీ ఉన్న వాటిలోనే వీరిని చేరుస్తుండడంతో దీనికి కేంద్రం నుండి ఎలాంటి ఇష్యూ ఉండకపోవచ్చు.

ఈ రెండు కూడా చంద్రబాబు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు. రెండు దశాబ్దాల్లో కాపులకు ఎవరూ చేయనిది తాము చేసి చూపిస్తున్నామని చంద్రబాబు అన్నారు. బోయ, వాల్మీకి తెగలకు రిజర్వేషన్ల తో టీడీపీ అనంతపురం, కర్నూల్ జిల్లాలలో బాగా బలపడనుంది. కనీసం 15 నియోజకవర్గాలలో వీళ్ళు గణనీయ సంఖ్యలో ఉన్నారు.