Andhra Pradesh Assembly Marshals stops on Chandrababu anad TDP MLAశీతాకాల సమావేశాల్లో నాలుగో రోజైన నేడు సభలో పాల్గొనడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలుగా వెళ్లగా అసెంబ్లీ సెక్యూరిటీ అడ్డుకుంది. ప్లకార్డులతో లోపలికి వెళ్లొద్దని అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. తమ ఆఫీసుకు తీసుకెళ్తామని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినా సెక్యూరిటీ వినలేదు.

సెక్యూరిటీ సిబ్బంది తీరుకు నిరసనగా చంద్రబాబు, ఎమ్మెల్యేల అసెంబ్లీ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డు, బ్యానర్‌, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని.. అసెంబ్లీలోకి కాగితాలు కూడా తీసుకెళ్లొద్దని ఆదేశిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలో చెప్పుకొచ్చారు.

చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉన్నందుకు 40 నిమిషాలు బయట నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పట్ల మార్షల్స్‌ దారుణంగా ప్రవర్తించారన్నారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని లాగేశారని తెలిపారు. అయితే శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం టీడీపీ సభ్యుల తీరుపైనే మార్షల్స్‌ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

అసెంబ్లీ సజావుగా జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం యాగీ చేస్తున్నారన్నారు. పైగా మార్షల్స్ నే టీడీపీ సభ్యులు తోసేశారని మంత్రి చెప్పుకొచ్చారు. చీఫ్‌ మార్షల్‌ను పిలిపించి స్పీకర్‌ మాట్లాడాలని.. లేదంటే సభలో ఉండలేమన్నారు. అయితే అందుకు నిరాకరించిన స్పీకర్‌ తమ్మినేని.. అది (సభలో ఉండటం) ప్రతిపక్షల నిర్ణయానికి వదిలేస్తున్నట్టు తెలిపారు.