Kodali-Nani AP Ministerమద్యపాన నిషేధాన్ని అమలు చేసిన మహానుభావుడు ఎన్టీఆర్.., మద్యానికి మద్దతు ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని కొడాలి నాని అసెంబ్లీ వేదికగా తనకు అలవాటైన భాషా సంస్కృతితో టీడీపీ అధినాయకుడిపై విమర్శలు గుప్పించ్చారు. మద్యాన్ని నిషేధించిన వాడు దేవుడైతే, మద్యాన్ని అమలు చేస్తున్న వారందరూ దుర్మార్గులేనా… నాని అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధాన్ని కాదని చంద్రబాబు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారన్నది అందరికి విదితమే. తరువాత ప్రభుత్వాలు మారినా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రులు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆ దోవలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా 6 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు.

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేరేకంగా నాడు వైఎస్సార్ ఎన్నో కొత్త జీవోలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మద్యం విషయంలో మాత్రం పాత ప్రభుత్వ పాలసీనే మార్పులు చేసి యధాతధంగా అమలుచేశారు. మరి ఇప్పుడు తెరుచుకున్న నోళ్లు అప్పుడు ఏం చేస్తున్నాయని టీడీపీ నేతల నుండి విమర్శల పరంపర మొదలైంది.

అయితే ఈ మద్యం అమ్మకాల స్థాయి రానురాను బలపడుతూనే వస్తుండడం చూస్తేనే అర్ధమవుతుంది ఈ రాజకీయ నాయకుల చిత్త శుద్ధి ఏమిటో. పెరిగిన మద్యం అమ్మకాలను బట్టే తెలుస్తుంది అన్ని రాజకీయ పార్టీలు., వారి అధినేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయని! ఇందులో వైసీపీ పార్టీ వేరు కాదనేది కాదనలేని సత్యం.

మా మనిపేస్టోనే మాకు భగవద్గీత.., ఖురాన్., బైబిల్ అన్న వైసీపీ నాయకులు తమ ఎన్నికల హామీలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మద్య నిషేధం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నాయి టీడీపీ వర్గీయులు. మద్య నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రజలపై రుద్దడం అని మాకు తెలియలేదు అని ఎద్దేవా చేస్తున్నారు రాజకీయ విమర్శకులు.

మునుపెన్నడూ తప్పుపట్టని కొడాలి నాని ఒక్క చంద్రబాబు మీద మాత్రమే విరుచుకుపడడానికి కారణం ఏంటో వైసీపీ నేతలకే తెలియాలి అని టీడీపీ శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాజధానిగా ఎంచిన అమరావతిని కాదని., జగన్ మూడు రాజధానులు తీసుకువచ్చారు., గత ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు..,ఇరిగేషన్ వర్క్స్ లో రివర్స్ టెండరింగ్ పద్దతులను అవలంబించారు.

ఇలా రాష్ట్రంలో జగన్ తాననుకున్న పాలసీలతోనే ముందుకెళ్లారు. అదే విధంగా చంద్రబాబు అనుమతించిన ఈ మద్యం అమ్మకాలను నిషేధించి అన్న ఎన్టీఆర్ మాదిరే పూర్తి మద్య నిషేధం అమలు చేసి జగన్ కూడా దేవుడవచ్చుగా అని టీడీపీ సోషల్ మీడియా కోడైకూస్తోంది. కొడాలి నాని ఉద్దేశం ప్రకారం మద్యం అమ్మకాల విషయంలో ఒక్క ఎన్టీఆర్ తప్ప మిగతా ముఖ్యమంత్రులందరూ దుర్మార్గులే అన్న మాట.

మరి జగన్ గారికి కొడాలి నాని మాటలలో అంతరార్ధం అర్థమైందో లేదో కానీ అసెంబ్లీ సమవేశాలను వీక్షిస్తున్న సగటు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రజలకు మాత్రం అవగతమైంది. టీడీపీ చేస్తున్న ఈ ట్రోల్స్ చూస్తున్న వైసీపీ పెద్దలు మాత్రం కొడాలి నాని విరుచుకుపడింది బాబు మీదనా? లేక ఇంకెవరి మీదనా? అనే ప్రశ్నతో ఆగిపోయారు. అంటే చంద్రబాబుతో పాటు వైఎస్సార్.., జగన్.., ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులను కించపరచినట్లే భావించాలిగా అని వైసీపీ నాయకులే తమలో తామే చర్చించుకుంటుంన్నారన్న టాక్ నడుస్తోంది.