సీఎం చంద్రబాబు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు అది కూడా నిండు సభలో. తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శల పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎంతో హుందాగా ప్రవర్తించానని అయితే ఇలాంటి వారితో ప్రజల కోసం మాటలు పడుతున్నా అని చంద్రబాబు అన్నారు.
తల్లికి, తండ్రికి పుట్టినవాడైతేనంటూ ఓ నిందితుడు మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు. “తల్లిదండ్రులు మనకు దేవుళ్లతో సమానం, వారి గురించి మాట్లాడే సంస్కృతి ఇదేనా,” అంటూ ఆయన నిలదీశారు. జాతి కోసం పాటుపడుతున్న తనపై అసభ్యంగా మాట్లాడినప్పుడు చాలా బాధేస్తుందని కానీ తనపై చేసే విమర్శలన్నీ ఏపీ ప్రజల కోసం సహిస్తున్నానని తెలిపారు.
కాగా నిన్న చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అనుచితవ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు…’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ లీడర్ చంద్రబాబు అని, చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.