andhra pradesh amaravati secretariat opening dayనవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడి గ్రామంలో శరవేగంగా జరుగుతున్న తాత్కాలిక సచివాలయం పనులు జూన్ 15 నాటికి పూర్తి అవనున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అంతేకాదు, ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్ 27 నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన అంతా అమరావతి కేంద్రంగానే జరిగేలా సన్నాహాలు చేస్తున్నామని నారాయణ తీపి కబురు అందించారు.

శనివారం నాడు తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన మీదట ఈ దిశగా వ్యాఖ్యలు చేసారు మంత్రి గారు. వర్షం పడినా నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎక్కడికక్కడ శ్లాబ్ లు వేసుకుంటూ వెళుతున్నామని… ఏది ఏమైనా వచ్చే నెల 27 నుంచి అమరావతి నుంచే పాలనను సాగిస్తామని అన్నారు. జూన్ 27 నాటికి 11,500 మంది ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరానున్నారని తెలిపారు.