coronavirus lockdown effect Alcohol Addictionమద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ఆ తరువాత దశల వారీ నిషేధం అంది. నిషేధం మాటేమిటో గానీ ఇప్పటికీ మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వం అత్యధిక ఆదాయం సంపాదిస్తుంది. తాజాగా నిన్న పెట్టిన బడ్జెట్ ఈ ఏడాదికి గాను మద్యం అమ్మకాల ద్వారా 7931 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

గత ఏడాది వాస్తవ ఆదాయం కంటే ఇది 1,000 కోట్లు ఎక్కువ. తమకు మద్యం ద్వారా వచ్చే ఆదాయం అవసరం లేదు అంటూనే ప్రభుత్వం రేట్లు పెంచి ఖజానా నింపుకోవడం గమనార్హం. ఇక వ్యాట్ రూపంలో మరో 14,000 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా.

దీనితో ఒక్క మద్యం వల్లే ప్రభుత్వానికి 20,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కరోనా కారణంగా రెండు నెలల పాటు మద్యం దుకాణాలు మూసివేసి ఉన్నా, ఆదాయపు అంచనాలు తగ్గకపోవడం విశేషం. పైగా తాము అధికారంలోకి వచ్చాకా 30% వైన్ షాపులను తగ్గించేశాం అని ప్రభుత్వం చెప్పుకుంటుంది కూడా.

ప్రతి ఏడాది బడ్జెట్ లో ఇచ్చిన ఆదాయ అంచనాలకు అందుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువగా సంపాదించి పెట్టేది ఒక్క మద్యం మాత్రమే. ఏది ఏమైనా రాష్ట్ర ఖజానా నింపడానికి… ప్రభుత్వాలు ఓట్ల కోసం ఇచ్చే సంక్షేమ పథకాలకు సొమ్ములు సమకూర్చడానికి మందుబాబులు ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకోవాల్సిందే.