Andhra Pradesh Chief Minister YS Jaganఏపీ సీఎం జగన్ కేంద్రంగా ప్రజల నుండి వ్యక్తమవుతున్న ఆక్రంధనలతో సోషల్ మీడియా నిండిపోతోంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విమర్శల గళం విప్పుతున్నారు. బస్సెక్కి ఓ మహిళ ‘ఇక నువ్వు మళ్ళీ సీఎం కాలేవు’ అంటూ శపిస్తుంటే, డప్పు పట్టుకున్న ఇంకొంత మంది ‘పోవాలి జగను… దిగిపోవాలి జగనూ…’ అంటూ ఆలపిస్తున్నారు.

నువ్వున్నాను విన్నాను అంటూ రంకెలేస్తివయ్యో…
నీ మాయ మాటలు నమ్మి మేం మోసపోతిమయ్యో…
మా పథకాలన్నీ తీసి చిరునవ్వు నవ్వితివయ్యో…
పోవాలి జగను… దిగిపోతావు జగనూ…
నువ్వు పోవాలి జగను… దిగిపోవాలి జగనూ…
ఏమన్నాం మనం… రావాలి జగన్, కావాలి జగన్…
ఇప్పుడేమంటున్నామ్…
పోవాలి జగను… దిగిపోతావు జగనూ…
నువ్వు పోవాలి జగను… దిగిపోవాలి జగనూ…

పోవాలా వద్దా… పోవాలా వద్దా… అన్న స్పందనకు పోవాలి అన్న స్పందన ఎదుటి వారి నుండి వ్యక్తమయింది. పాట రూపంలో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. చూడబోతుంటే… రోజులు గడుస్తున్న కొద్దీ ఇలాంటి విమర్శల వీడియోలకు సోషల్ మీడియా నిలయంగా మారేలా కనపడుతోంది.