andhhagadu-official-teaser-raj-tarun‘కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్ తాజాగా “అంధగాడు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 26న విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో రాజ్ తరుణ్ గుడ్డి వాడి పాత్రలో కనిపిస్తుండడంతో, కావాల్సినంత వినోదం పండినట్లుగా కనపడుతోంది.

అయితే టీజర్ తొలి ఎండ్ లో గుడ్డివాడి పాత్ర ద్వారా పండిన వినోదం, రెండవ భాగానికి వచ్చే సరికి రొటీన్ కమర్షియల్ యాంగిల్ ను టచ్ చేయడంతో ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రాజ్ తరుణ్ యాక్టింగ్ లో ఎలాంటి మార్పులు లేకపోగా, హేబా పటేల్ మాత్రం ఇటీవల చిత్రాలలో కంటే కాస్త అందంగా కనపడుతోంది. ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ సినిమా విడుదల రోజునే ఈ సినిమా రిలీజ్ కు కూడా ముహూర్తం ఖరారు చేయడం విశేషం.