Ancient chariot of Antarvedi temple burntప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది.అరవై రెండేళ్లుగా ఉన్న ఆ రథం ఎవరు దగ్ధం చేశారనేది తెలియదు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగింది. షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది.

రథం దగ్ధమైన స్థలాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే దీనికి కారణమైన వారిని అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఈ ఘటన పై కొందరు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. రథం దగ్ధం చెయ్యడంలో ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అని పలువురు అనుమానపడుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ క్రిస్టియన్ మతస్తుడు కావడంతో హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందా? దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది ఎవరు? మతపరమైన రాజకీయాలు ఎవరికీ లబ్ది చేస్తాయి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే గనుక నిజమైతే తుచ్చ రాజకీయాల కోసం ఇలా మతవిశ్వాసాలను వాడుకోవడం మాత్రం దారుణం. దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశిస్తూ.. దేవ‌దాయ శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర‌మోహ‌న్‌ను విచార‌ణ అధికారిగా నియ‌మించారు. బాధ్యులను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అదే విధంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పున: నిర్మాణానికి చ‌ర్యులు చేప‌ట్టాల‌ని ఆయనకు మంత్రి సూచించారు