Anchor Swetha Reddy reveals casting couch of Bigg Boss 3 Teluguయూట్యూబ్ షోలతో ఫేమసైన యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ 3 మీద తీవ్ర ఆరోపిణలు చేశారు. “బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్‌ను ‘ఇంప్రెస్‌’ చేయాలట… అందుకు తగ్గ కమిట్మెంట్ ఉందా,” అని అడిగారని శ్వేతారెడ్డి ఆరోపించారు. ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా? తెలుగువాళ్లపై గలీజ్‌ కల్చర్‌ రుద్దుతామంటే ఊరుకోం. బిగ్‌బాస్‌-3ని నిషేధించాలి ఆమె మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణ సంచలనంగా మారింది. ఈ నెల 21 నుండి ప్రారంభం కాబోతున్న షోకి ఇది పెద్ద మచ్చ అయ్యే అవకాశం ఉంది. నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్ట్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఆరోపణ రావడం గమనార్హం. బిగ్ బాస్ 3 షో కోసం దాదాపుగా నలభై మందితో అగ్రీమెంట్స్ చేసుకున్నారట. అందులో 14 మందే ఫైనల్ అవుతారని సమాచారం. ఆ 14 మందిలో పేరు ఉండటం కోసం వాళ్ల బాస్‌ను ‘ఇంప్రెస్‌’ చెయ్యాలని అడిగినట్టు శ్వేతారెడ్డి ఆరోపించారు. మరి దీనిపై బిగ్ బాస్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

100 రోజుల పాటు జరగబోయే ఈ షోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలున్నాయి. మొదటి రెండు సీజన్‌లకు ఎన్టీఆర్, నాని హోస్టులు కాగా మూడోసారి నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. తమిళ, హిందీ బిగ్ బాస్ షోలకు అన్ని సీజన్‌లకు ఒకే హోస్ట్ ఉండగా తెలుగుకు మాత్రం మూడు సీజన్‌లకు ముగ్గురు అయ్యారు ఇప్పటికి. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళ్ లో కమల్ హస్సన్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్, నానిలకు ఇంతకు ముందు టీవీలో చేసిన అనుభవం లేకపోగా… నాగార్జున మాత్రం ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ అనిపించుకున్నారు.