Anchor Srimukhi Power Star Pawan Kalyan Braceletతెలుగు సినీ జనాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. ప్రస్తుతం ఎవరిని కదిపినా ‘పవన్ కళ్యాణ్’ నామ జపం చేయకుండా ఉండలేరు. వర్ధమాన నటీనటుల నుండి టీవీ యాంకర్ల వరకు అందరూ అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తి అభిమానుల మనసు దోచుకుంటున్నారు. ఆ క్రమంలోనే హాట్ యాంకర్ శ్రీముఖి, ‘పవర్ స్టార్’ పేరున్న ‘బ్రాస్ లెట్’ ధరించి, దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

“తన మేకప్ మెన్ మున్నా ఈ అమేజింగ్ పవర్ స్టార్ బ్రాస్ లెట్ ను తయారు చేసుకున్నాడని” చెప్తూ దానిని తన చేతికి వేసుకుని ఫోటోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. శ్రీముఖి విషయం ఎలా ఉన్నా… పవర్ స్టార్ బ్రాస్ లెట్ మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అభిమానాన్ని చాటుకోవడంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ తీరే వేరు కదా! ఆ క్రమంలోనే ఈ స్పెషల్ బ్రాస్ లెట్ పుట్టుకొచ్చింది.