Allu Arjun Pushpaసహజంగా ఒక సినిమా అనూహ్యంగా హిట్ అయినప్పుడు… సదరు హీరోలు, డైరెక్టర్లు ఆ సినిమాలోని కొన్ని అంశాలను తమ తదుపరి చిత్రాలలో సెంటిమెంట్ గా కొనసాగిస్తారు. రంగస్థలం అనే సినిమా డైరెక్టర్ సుకుమార్ కేరీర్ లో అతిపెద్ద హిట్ గా అవతరించింది. ఆ సినిమాలో యాంకర్ అనసూయ రంగమత్త అనే కీలక పాత్ర చేసింది.

ఆ సినిమా లో రంగమత్త పాత్ర హైలైట్… అలాగే అనసూయ కు కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.రంగస్థలం సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. సుకుమార్ తదుపరి చిత్రంలో పుష్ప లో కూడా అనసూయ కీలక పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాలో తాను లేన‌ని క్లారిటీ ఇచ్చేసింది అనసూయ.

”ఇంత వ‌ర‌కూ అయితే.. అలాంటి ప్ర‌తిపాద‌న ఏమీ నా దగ్గ‌ర‌కు రాలేదు. నిజంగానే వ‌స్తే.. త‌ప్ప‌కుండా చేస్తా. ఆ విష‌యం మీడియాకి కూడా నేనే చెబుతా” అని తేల్చి చెప్పింది. ఈ వార్త అభిమానులను కొంత నిరాశపర్చినా సెంటిమెంట్ తో పని లేకుండానే పెద్ద హిట్ కొడతాం అంటున్నారు వారు.

ఈ చిత్రం ఆగస్టు 13 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్‌ను ఏప్రిల్ 8 న బన్నీ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ గత ఏడాది ఆరంభంలో తన అల వైకుంఠపురంలో సూపర్ సక్సెస్ తర్వాత ఈ సినిమా ని అంతకంటే పెద్ద రేంజ్ కి తీసుకుని వెళ్ళాలని పట్టుదలగా ఉన్నాడు.