anasuya-bharadwaj-tweete on-chi-la-sow-diector-rahul-ravindranఆగష్టు 3వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న “చి||ల||సౌ||” సినిమాలోని ఓ పోస్టర్ ను పోస్ట్ చేసిన హీరో సుశాంత్, దానికి కాప్షన్ చెప్పాల్సిందిగా నెటిజన్లను కోరారు. దీనికి స్పందించిన కమెడియన్ వెన్నెల కిషోర్, ఆ ఫోటోకు తగిన విధంగా ఓ పంచ్ వేసారు. ఆపై, ఆ పంచ్ పై స్పందించిన ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ ‘పర్ ఫెక్ట్ కాప్షన్’ అంటూ కితాబిచ్చేసింది.

డైరెక్టర్ రాహుల్ మరియు హీరో సుశాంత్ ఉన్న ఆ ఫోటో చూసి ఇంతకీ వెన్నెల కిషోర్ ఏమన్నారో తెలుసా… “రాహుల్ : బ్రో, క్లబ్ కు వెళ్ళేముందు ఏ విధమైన ఐడి కార్డులు తీసుకెళ్ళాలి? ఏంటో ఎవ్వరిని అడగరు, నన్ను అడుగుతున్నారు” అనగా, “సుశాంత్ : మీరు పూర్తిగా గడ్డం చేసుకోవద్దు బ్రో” అన్న సమాధానం చెప్పినట్లుగా కిషోర్ పెట్టిన కాప్షన్ కు అనసూయకు నవ్వులు పూయించింది. నిజమే కిషోర్ కరెక్ట్ క్యాప్షన్ చెప్పినట్లుగానే ఉంది!