Rangammatha Auditionమూడు వారాల క్రితం విడుదలై సూపర్ హిట్ అయిన ‘రంగస్థలం’ సినిమాలో లేని రంగమ్మత్తకు సంబంధించిన ఓ సీన్ ను ఆడిషన్స్ లో భాగంగా అనసూయపై చిత్రీకరించగా, తాజాగా ఆ వీడియోను అనసూయ తన అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో అనసూయ పాత్రకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే.

పల్లెటూరి మహిళగా అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ వీడియోలో పసుపు రంగు చీర, ఎరుపు రంగు జాకెట్ లో కనిపిస్తుండగా, చిట్టిబాబు, రంగమ్మత్త మధ్య జరిగిన ఓ సీన్ ఇది. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది?

ఈ పాటికి మీ మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు… అయినా నేను లేనా ఏంటి? అన్న డైలాగులు ఉన్నాయి. ఈ సీన్ సినిమాలో లేనప్పటికీ, ఉంటే బాగుండుననిపించేలా ఉంది. ఆడిషన్ లో భాగంగా సీన్ తీసినప్పటికీ, అందులోనూ అనసూయ ఇరగదీసిందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.