anasuya-bharadwaj-in-chiranjeevi-koratala-siva-movieటీవీ యాంకర్ అనసూయ తన అందచందాలతో, ఆకట్టుకునే వస్త్రధారణతో బుల్లి తెరకే గ్లామర్ తెచ్చింది. సినిమాలలోకి కూడా వచ్చిన ఈ భామ తన కేరీర్ ను తెలివిగా ముందుకు తీసుకుపోతుంది. సహజంగా తెలుగు అమ్మాయిలను సినిమాలలో తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఈ అమ్మడు మంచి ప్లాన్ వేసింది. అనసూయ పెద్ద సినిమాలలో చిన్న వేషాలు వేస్తూ ఆడియన్స్ కు దగ్గర అవుతుంది. అలా సంపాదించిన పాపులారిటీతో చిన్న సినిమాలలో హీరోయిన్ పాత్రలు వేస్తుంది.

“రంగస్థలం” లో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రకు విశేషస్పందన లభించింది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో కనిపించనున్నకథనం మూవీ ఈ నెలలోనే విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా మూవీలో అనసూయ కు ఓ కీలక పాత్రను దర్శకుడు ఆఫర్ చేశారని సమాచారం. రంగస్థలంలోని ఆమె పాత్ర లాగానే ఇది కూడా చిన్నదైనా ప్రాధాన్యత కలిగి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటుందట.

ఆ వచ్చిన పేరుతో మరో రెండు మూడు చిన్న సినిమాలలో ప్రధాన పాత్రలు కొట్టేస్తుంది ఈ అమ్మడు. చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆగస్టు 22 న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కోసం ఆమెకు భారీగా పారితోషకం ఇవ్వజూపారని సమాచారం. కొడుకు పక్కన అత్తగా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు తండ్రి పక్కన ఎటువంటి పాత్ర చేస్తుందో.