Anasuya Bharadwaj in Flash Back‘పుష్ప’ రిలీజ్ కు కొద్దీ గంటలు సమయం ఉందనగా, అనసూయకు సంబంధించిన ఓ రెండు ఫోటోలు సోషల్ మీడియాను చుట్టేసాయి. ఏంటి ఇంత బోల్డ్ గా ‘పుష్ప’లో కనిపించిందా? అని ఒక్క నిముషం అందరూ అవాక్కయ్యేలా ఉన్న ఆ ఫోటోలలో అనసూయ గెటప్ మరోలా ఉండడంతో, ఇవి ‘పుష్ప’ సినిమాకు సంబంధించినవి కాదని ఖరారయ్యింది.

మరి ఈ రేంజ్ లో ఏ సినిమాలో కనిపించబోతోంది? అన్న ప్రశ్నకు “ఫ్లాష్ బ్యాక్” సమాధానంగా నిలిచింది. ప్రభుదేవా, రెజీనాలు జంటగా నటించిన ఈ సినిమాకు డాన్ శాండీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ కనిపించని క్యారెక్టర్ లో అనసూయ ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమయ్యిందని లేటెస్ట్ రిలీజ్ అయిన ఈ రెండు ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి.

ద్రాక్షాయణి పాత్రలో పుష్పలో కనిపించిన విధానానికి, ఈ ఫ్లాష్ బ్యాక్ మూవీలో కనిపిస్తోన్న అనసూయకు ఎక్కడ పొంతన లేకపోవడం విశేషం. దీంతో డిఫరెంట్ రోల్స్ లో నటించాలన్న అనసూయ ఆకాంక్ష నెరవేరుతున్నట్లుగా ఉంది. గతంలో “వేదం” సినిమాలో ఇలాంటి రోల్ ను చేసిన అనుష్క అవార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

‘జబర్దస్త్’ ద్వారా ఆల్రెడీ బుల్లితెరపై గ్లామర్ ను చూస్తున్నారు, సిల్వర్ స్క్రీన్ పైన ప్రేక్షకులకు షాక్ ఇచ్చే రోల్స్ చేయాలని కంకణం కట్టుకున్నాను అంటూ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం ఈ “ఫ్లాష్ బ్యాక్” మూవీ ఫోటోలకు లెక్క అయితే సరిపోతుంది. మరి నేడు రిలీజ్ అయిన ‘పుష్ప’లో ‘ద్రాక్షాయణి’ క్యారెక్టర్ పరిస్థితి ఏంటి? అంటే… గుర్తు పెట్టుకోండి ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం..!