ananya-ramprasad-metoo‘మీటూ’ పేరుతో సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోన్న ఉద్యమంలో ఇప్పటికే ఎన్నో సంచలన పేర్లు బయటకు వచ్చాయి. ఈ దెబ్బకు బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్ నాథ్ వంటి ప్రముఖుల జాతకాలు మారిపోగా, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ లు కీలక ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా కోలీవుడ్ లో ‘మీటూ’ ఉద్యమం మరో మలుపు తీసుకుంది.

లెస్బియన్ గా మారాలంటూ తనను సహనటి మాయ ఎస్.కృష్ణన్‌ వేధించిందని అనన్య రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేసింది. అనన్య ఆరోపణలతో కోలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. తొడరి, మగళిర్ మట్టుమ్, వేట్టైక్కారన్ వంటి సినిమాల్లో మాయ నటించగా, తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో “2.0” సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది.