Ananya Pandey costume in birthday party“లైగర్” సినిమాతో తెలుగు నాట పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల ‘గెహరైయాన్’ సినిమాలో దీపికా పదుకునేతో పాటుగా అందాల విందు చేసింది.

సినిమాలో ఏముంది అసలు విషయం… ఈ పార్టీలో కదా… అన్న రీతిలో అనన్య పాండే లేటెస్ట్ కాస్ట్యూమ్స్ మారిపోయాయి. సహజంగా స్విమ్మింగ్ పూల్ లో దిగడానికి స్విమ్ సూట్స్ ని ధరిస్తుంటారు, కానీ అనన్య మాత్రం ఈ పార్టీకే స్విమ్ సూట్ తో హాజరై అవాక్కు చేసింది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలకు గానూ విచ్చేసిన అనన్య పాండే వస్త్రధారణ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఈ బ్యూటీ కాస్ట్యూమ్స్ చూసి నోరెళ్ళబెట్టడం నెటిజన్ల వంతయ్యింది.

ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు మన టాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఆగష్టు 12వ తేదీన విడుదల కాబోతున్న ‘లైగర్’లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండేనే హీరోయిన్ గా కనువిందు చేయనుంది. ఆ ‘సినిమా’ కంటే ముందు ఈ ‘సినిమా’తో అనన్య హాట్ టాపిక్ గా మారిపోయింది.