ananthapuram tdp badhude badhudu program   అనంతపురం జిల్లా టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర రావు నేతృత్వంలో మంగళవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో టిడిపి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరులు సుబేదార్ చెరువు పూడ్చివేయబోతే అడ్డుకొన్నందుకు దొడగట్ట గ్రామస్తులు ఉమామహేశ్వర రావును అభినందించి ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నారు.

కంబదూరు మండలం కుర్లపల్లికి చెందిన టిడిపి కార్యకర్తలు బోయ హరీష్, హరిజన వన్నూరమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఉమామహేశ్వర రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి టిడిపి తరపున రూ.5,000 ఆర్ధిక సాయం అందజేశారు.

మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు నేతృత్వంలో మంగళవారం గుంతకల్లు మండలంలోని నెలగొండలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జగన్ హయాంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక, మద్యం మాఫియాలే కనిపిస్తున్నాయని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారికి బెదిరింపులు, పోలీసులతో వేధింపులు, అక్రమకేసులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మూడేళ్ళలోనే రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించేసి, తిరిగి ప్రజలపైనే దౌర్జన్యాలకు పాలపడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్ళీ ప్రశాంత వాతావరణం ఏర్పడి అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికలలో టిడిపిని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉందని అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌ పవన్ కుమార్‌ గౌడు, మాజీ ఎంపీపీలు రాయల రామయ్య, ప్రతాప్ నాయుడు, టిడిపి పార్లమెంటరీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, కౌన్సిలర్ శ్రీరాములు, టిడిపి స్థానిక నాయకులు సప్లయర్స్ హనుమంతు, తలారి మస్తానప్ప, చికెన్ జగన్, ఫ్రూట్ మస్తాన్, ఆటో ఖాజా, ఫైజిలు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.