Anantapuram-TDP-అనంతపురం అర్బన్ పరిధిలో శుక్రవారం టిడిపి నేతలు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, క్లస్టర్ ఇన్‌ఛార్జి కూచిహరి, 39వ డివిజన్‌ అధ్యక్షుడు చేపల హరి అధ్వర్యంలో పట్టణంలో 38,39డివిజన్లలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్ళి వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువూల్ ధరలు, ఇంటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు ఏవిదంగా పెరిగాయో, ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు కానీ అవి అర్హులైనవారికి కూడా అందకుండా తప్పించేందుకు జగన్ ప్రభుత్వం ఏవిదంగా రకరకాల ఆంక్షల పేరుతో కొర్రీలు వేస్తోందో ప్రజలకు వివరించారు.

ఈ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవళ్ళ మురళి, జిల్లా టిడిపి అధికార ప్రతినిధులు నారాయణస్వామి యాదవ్, సరిపూతి రమణ, పట్టణ అధ్యక్షుడు మారుతీ కుమార్ గౌడ్, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు విజయశ్రీ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మానెమ్మ, మాజీ కార్పొరేటర్ జానకి, టిడిపి కార్యకర్తలు రాయల్ కొండయ్య, సైఫుద్దీన్, మార్కెట్ మహేశ్, సున్నం శ్రీనివాసులు, శిరిసాల రాంబాబు, మనోహర్, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, శంకరమ్మ, గంగవరం బుజ్జి, హాజీవలి, జెఎం బాషా, శ్రీనివాసులు చౌదరి, సుధాకర్ నాయుడు, సురేంద్ర, నాగరాజు నాయుడు, వడ్డే మురళి, వడ్డే పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.