ట్రైలర్ టాక్ – హిట్ కళలు పుష్కలంగా ఉన్నాయ్!

Anando Brahma Theatrical Trailer‘ఫస్ట్ లుక్’తోనే ప్రేక్షకులను పడేసిన “ఆనందో బ్రహ్మా” చిత్ర యూనిట్, అదే ఊపును తాజాగా విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ వరకు విజయవంతంగా కొనసాగిస్తోంది. ఓ పాపకు తాత దెయ్యం కధ చెప్పడంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ లో ప్రతి షాట్ కూడా వీక్షకులను ఆకట్టుకునే విధంగా కట్ చేసారు. అలాగే క్లైమాక్స్ లో ‘మీ తాత చనిపోయి మూడేళ్ళయ్యింది’ అన్న డైలాగ్ తో ట్రైలర్ ను మరింత రక్తి కట్టించారు.

రేయి చీకటి ఉన్న వ్యక్తిగా ‘వెన్నెల కిషోర్’ కామెడీ విన్యాసాలు, వర్మను అనుకరించే షకలక శంకర్ డైలాగ్స్ కు తోడు ప్రధాన పాత్రలో నటించిన శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్, తాప్సీ హావభావాలు… ఇలా పాత్రలన్నీ బాగా పండినట్లుగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. అలాగే సాంకేతిక విభాగంలో అనిష్ తరుణ్ కుమార్ ఫోటోగ్రఫీ, కే అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా అన్నీ అత్యున్నత స్థాయిలోనే ఉన్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే… హిట్టు కళలు పుష్కలంగా కనపడుతున్న ట్రైలర్ గా “ఆనందో బ్రహ్మా”ను అభివర్ణించవచ్చు. దీంతో చిత్ర విడుదల తేదీ అయిన ఆగష్టు 18 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూడవచ్చు. ‘భలే మంచి రోజు’ బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. గతంలో ‘విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల’ సినిమాలకు దర్శకత్వం వహించారు మహి.



Follow Mirchi9 on Google News

This Week Releases on OTT – Check ‘Rating’ Filter

Hiring Content Writer: We are looking to hire a ‘Telugu’ content writer. Send your sample articles to [email protected]

Allu ARjun Vijay DeverakondaDon't MissAllu Arjun's Fans Furious With Vijay DeverakondaThe much hyped theatrical trailer of Rajamouli, Jr NTR, and Ram Charan's magnum opus creation...heroine Tollywood Mubmai ExpensesDon't MissInside Story: Heroine Sucking Producer's Blood With Mumbai BatchShe is one of the top heroines in Telugu film industry. Despite a slow start...రాజు గారికి మరీ ఎటకారం ఎక్కువండి!Don't Missశోభనం టాక్స్... ఏం ఎటకారం గురూ..!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 'వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్' 5%పై సోషల్ మీడియాలో పెద్ద...Jr NTR Bheem - RRR MovieDon't Missఆర్ఆర్ఆర్... ఫోటోషాప్ పోస్టరా..?రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్"కు సంబంధించి రెండు పోస్టర్లను సోమవారం నాడు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్,...పుష్ప... 'ఫైర్' అనుకొంటివా... 'ఫ్లవర్..!'Don't Missపుష్ప ట్రైలర్... 'కంటెంట్'లో కన్ఫ్యూషన్..!'ఆర్య, ఆర్య 2' తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ కాంభినేషన్ లో వస్తోన్న "పుష్ప" సినిమాపై సినీ పరిశ్రమలో...

Mirchi9