Anand Deverakonda Midlle Class Melodies Amazon Prime videoఅమెజాన్ ప్రైమ్ ఈ నెల 15 నుండి డిసెంబర్ 25 వరకు వివిధ భాషలలో తొమ్మిది సినిమాలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. హిందీ లో వరుణ్ ధావన్ కూలీ నెంబర్ 1, రాజ్ కుమార్ రావ్ చలాంగ్, భూమి పెడ్నేకర్ దుర్గావతి… అలాగే తమిళంలో సూర్య సూర్యారాయ్ పొట్రు ప్రధానమైనవి. తెలుగులో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా ఉంది.

ఈ సినిమా నవంబర్ 15న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది అమెజాన్. ఈ మూవీకి కొత్తగా వినోద్ అనంతోజు దర్శకత్వం వహించాడు. లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ముందుగా థియేటర్లలోనే విడుదల చెయ్యాలని అనుకున్నా ఇప్పుడు ఆలస్యం అయ్యేలా ఉండడంతో ఆన్ లైన్ రిలీజ్ కు వెళ్తున్నారు.

అక్టోబర్ 15 నుండి 50% కెపాసిటీ తో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇప్పట్లో పెద్ద.. మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిత్రంలో ఆనంద్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ఏడాది విడుదలైన చూసి చూడంగానే అనే సినిమాతో ఆమె తెలుగులో అరంగేట్రం చేసింది.

కేర్ ఆఫ్ కాంచరపాలెం కోసం సంగీతం స్కోర్ చేసిన స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి సంగీత కంపోజర్. వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ తన భవ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద్ ప్రసాద్ ఎక్కువగా గోపీచంద్ తో సినిమాలు చేసే వారు. ఆయన చివరిగా బాలయ్య, పూరి జగన్నాధ్ తో పైసా వసూల్ సినిమాని నిర్మించారు.