Anand Annamalai -  Vijay Deverakondaచిన్న బడ్జెట్లతో సినిమాలు తీసి పెద్ద హిట్లు కొడితేనే ఇండస్ట్రీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. అయితే అటువంటి హీరోలు కరువైపోతున్నారు. రెండు మూడు హిట్లు కొట్టగానే సినిమా బడ్జెట్లు అమాంతం పెంచేసి డిస్ట్రిబ్యూటర్లకు మార్జిన్స్ తగ్గించేస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే మునిగినట్టే ఈ కోవలోకి ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేరిపోయినట్టు ఉన్నాడు. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న హీరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్.

ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. కేవలం రెండు బైక్‌ రేసింగ్‌ సన్నివేశాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ఫార్ములా వర్మ ట్రాక్‌ కోసం పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావటంతో పాటు ఫారిన్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు, కాస్ట్‌లీ బైక్‌లు ఇలా అన్నింటికీ కలిపి భారీగానే ఖర్చయినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

సినిమా హిట్ అయితే వచ్చే లాభాలు తగ్గిపోతాయి పోతే బయర్లు మునిగిపోతారు. రెండు హిట్లు పడగానే మన హీరోలు బడ్జెట్లు కూడా ఎందుకు పెంచేసుకోవాలి అనుకుంటారో మరి. ప్లాప్లలోకి వెళ్తే అదే వారి పాలిట శాపంగా మారుతుంది. ఇది ఇలా ఉండగా విజయ్ డియర్‌ కామ్రేడ్‌ పనులు ఇప్పటికే పూర్తి కాగా, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. డియర్‌ కామ్రేడ్‌ చిత్రం జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు మొదలు పెట్టారు.