anaganaga-o-premakatha-teaserప్రధాన తారాగణం అంతా కొత్తవారితో తెరకెక్కిన “అనగనగా ఓ ప్రేమకధ” సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. అశ్విన్ జే విరాజ్, రిద్ధి కుమార్ జంటగా నటించగా, ప్రతాప్ తాతంశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘తన తండ్రి తర్వాత ప్రేమించింది నిన్నే అని చెప్పించిన హీరోయిన్ చేత, చివరి షాట్ లో హీరోను కొట్టించి’ టీజర్ పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేసారు గానీ, ఇది పెద్ద ‘గజినీ’ లవ్ స్టోరీ మాదిరి కనపడుతోంది.

అగ్ర హీరోల సినిమాలైనా, అవి రొటీన్ కొట్టుడు అయితే తిరస్కరింపబడుతున్న రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో ముక్కు, మొహం తెలియని నటీనటులతో ఓ రొటీన్ స్టోరీని తెరకెక్కిస్తే ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చో చిత్ర యూనిట్ కే తెలియాలి. హీరోయిన్ హీరో లెంపకాయ కొట్టగానే, రామ్ ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా గుర్తుకు వస్తే అది వీక్షకుల తప్పుకాదు, కంటెంట్ అలా ఉంది మరి!