Anaganaga----Goodachari-Songఅడవి శేష్, శోభిత ధూళిపాళ జంటగా నటిస్తోన్న “గూడచారి” సినిమా టీజర్ ఇటీవల విడుదలై వీక్షకుల మెప్పు పొందిన విషయం తెలిసిందే. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ‘అనగనగా’ అనే తొలి లిరికల్ సాంగ్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసారు.

టీజర్ లో కనిపించిన అదే స్పీడ్ ను మైంటైన్ చేయడంలో ఈ సాంగ్ సక్సెస్ అయ్యింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ పాటకు రమేష్ యాద్మ సాహిత్యం అందించారు. అంబిక సశిట్టల్ ఆలపించిన ఈ పాట బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లో సాగే విధంగా వినపడుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది.