Amy Jackson disappointed with 2.0 movieనిజమే. ఇద్దరు బడా హీరోలు నువ్వా నేనా అని తలపడుతూ ఉంటే, ఆ మధ్యలో నన్ను ఎవరు చూస్తారు అన్న ఆలోచన కూడా రాకపోవడం ఆమె అమాయకత్వంగానే చెప్పవచ్చు. ఇంతకీ ఎవరు ఆ అమాయకులు అంటే మీకు ఈపాటికే అర్ధం అయిపోయి ఉండాలి. అమీ జాక్సన్…తమిళ సినిమాలో మన్సి హీరోయిన్ గా డీసెంట్ హిట్స్ ఇచ్చిన అమీ మరింత ఫాలోయింగ్ పెంచుకునే సమయంలో రజనీకాంత్ పక్కన చెయ్యాలి అని అనగానే ఎగిరి గంతులు వేసింది.

అయితే ఆ ఆనందంలో ఆమె స్క్రిప్ట్ వినలేదో, లేకపోతే దర్శక నిర్మాతలే, రజనీకాంత్ పక్కన నటిస్తున్నావ్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నావ్ ఇంకేం కావాలి అని మభ్య పెట్టారో తెలీదు కానీ. సినిమా చూసిన తర్వాత కానీ కార్ధం కాలేదు ఆమెకు ఈ సినిమాలో ఆమెది గెస్ట్ రోల్ లాంటి పాత్ర అని. ఆ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అని. అయితే ఒక రకంగా రోబో ఫర్స్ట్ పార్ట్ లో కధ అంతా ఐశ్వర్యా రాయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బహుశా ఆ పాత్రను మైండ్ లో పెట్టుకుని ఈ అమ్మడు ఈ పాత్రను ఒకే చేసేసినట్లుగా ఉంది. ఇంకేం ఉంది ఆమెకు పూర్తిగా మేకప్ వేసి చివరకు రజనీకాంత్ పక్కన నిలబెట్టారు అంతే.

ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే, సినిమాలో పాత్ర పెద్దగా లేకపోయినా, పాటలు ఉన్నా ‘ఐ’సినిమాలో లాగా కనీసం ఆమె అందాల ఆరబోతకైనా పనికి వచ్చి ఉండేది…సినిమాలో పాటలు లేకపోవడం వల్ల ఆ అవకాశం కూడా అమీ జాక్సన్ కు దక్కలేదు అనే చెప్పాలి. కాస్త పచ్చిగా మాట్లాడుకుంటే శంకర్ అమీని బొమ్మలా చూపించి కుర్ర కారుని బాగా హర్ట్ చేశాడు. ఆమె అందాల కోసం థియేటర్స్ కి వచ్చిన వారిని నీరస పడేలా చేశారు. ఏది ఏమైనా అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానా అని ఆమె బాధ పడుతుంది అని తెలుస్తుంది. పాపం అమీ జాక్సన్.