Amrutharamam- 47 days- Krishna and His Leelaఇప్పటివరకు చాలా కొద్ది మంది తెలుగు చిత్రనిర్మాతలు థియేట్రికల్ విడుదలను దాటవేసి వారి చిత్రాలను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చెయ్యడానికి ముందుకు వచ్చారు. అమృతారామం, కృష్ణ అండ్ హిస్ లీలా, 47 డేస్ వంటి చిన్న చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. అమృతారామం చాలా ఘోరంగా విఫలం అయ్యింది మరియు గత రాత్రి విడుదలైన 47 డేస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.

ఈ రెండు సినిమాలు జీ 5 లో విడుదలయ్యాయి. కృష్ణ అండ్ హిస్ లీలా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఈ చలన చిత్రానికి మంచి టాక్ మరియు సమీక్షలు వచ్చాయి. కానీ చిన్న కాస్టు మరియు పేలవమైన ప్రమోషన్ల కారణంగా ఈ సినిమాకు పెద్దగా హైప్ రాలేదు. ఈ సినిమా విడుదల అవుతుందని కూడా ఆడియన్స్ కు తెలియని పరిస్థితి.

అనేక బాలీవుడ్ చిత్రాలలో… స్టార్స్ ఉన్న చిత్రాలు కూడా ఆన్‌లైన్ విడుదల వైపు మొగ్గుచూపుతున్నాయి. నిన్న హాట్ స్టార్ ఒకేసారిగా ఏడు బాలీవుడ్ సినిమాల ప్రకటన చేసింది. ఈ తరుణంలో ప్రముఖ సినిమాల తెలుగు చిత్రనిర్మాతలు ఎంతవరకు ఆగగలరు అనేది చూడాలి. రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీతీ ప్లాట్‌ఫామ్‌లకు ఖచ్చితంగా గుర్తించదగిన చిత్రం అవసరం.

ఈ తరుణంలో వారు మన నిర్మాతలకు మెరుగైన ఆఫర్లు ఇస్తే కొంత మేర కదలిక రావొచ్చు. ఇప్పట్లో థియేటర్లు తీర్చుకునే పరిస్థితి కనబడకపోవడంతో గతంలో ఓటీటీ ప్లేట్ ఫామ్ లతో చర్చలను అర్దాంతరంగా నిలిపివేసిన నిర్మాతలు కూడా చర్చలను పునరుద్దరించే అవకాశం ఉంది.