amma Rajyam Lo Kadapa Reddlu release date 12th decemberరామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా రూపాంతరం చెందింది. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రికార్డు స్థాయిలో 93 కట్స్ చెప్పింది. దానితో చిత్ర యూనిట్ ఇప్పుడు రివైజింగ్ కమిటీ ను సంప్రదించారు. కొన్ని కట్స్ తో యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దీనితో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు.

రివైజింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంకా మిగిలే ఉందని నిరూపించింది అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే మొత్తానికి ఎన్ని కట్స్ పడ్డాయి అనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఈ చిత్రం తియ్యడం వివాదాస్పదం అయ్యింది. జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు చేసే కుట్రను ఊహాజనీతంగా చూపించే చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.

ఎన్నికల తరువాత అధికార పక్షం వారు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్న తరుణంలో ఇటువంటి సినిమా తీయడం అంటే ఖచ్చితం గా అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే. ఇది ఇలా ఉండగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ కూడా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.

డిసెంబర్ 12 విడుదల అంటే వెంకటేష్, నాగచైతన్య లు నటించిన వెంకీ మామ 13న విడుదల కావడం తో గట్టి పోటీ ఎదురుకానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో సిద్దార్థ తాతోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి.శ్రీధర్.