Amitabh-Bachchan-twitter followersఫిల్మ్ అండ్ పొలిటిక‌ల్ సెలిబ్రిటీల‌కు ట్విట‌ర్ మంచి వేదిక అయ్యింది. త‌మ అభిమానుల‌కు ట‌చ్ లో ఉండ‌టంతో పాటు.. వివిధ అంశాల పై వారి అభిప్రాయాల‌న నేరుగా పంచుకునే వేదిక గా ఉప‌యో గ ట్విట‌ర్ ఉప‌యోగ ప‌డుతుంది అన‌డంలో సందేహాం లేదు. ట్విట‌ర్ లో ఎక్కువ మంది అనుస‌రిస్తున్న ఫిల్మ్ సెలిబ్రిటీస్ లో నెంబ‌ర్ వ‌న్ రేసు లో అమితాబ్ ఉన్నారు. మూడు కోట్ల 15 ల‌క్ష‌ల మంది బిగ్ బి ని అనుస‌రిస్తున్నారు. ఇక సెకండ్ ప్లేస్ లో షారుక్ ఖాన్ 3 కోట్ల‌, 9 ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తున్నారు. యాక్ష‌న్ చిత్రాల కింగ్ స‌ల్మాన్ ఖాన్ ను 2 కోట్ల 85 ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్నారు.

ఆ త‌రువాత ప్లేస్ లో అక్ష‌య్ కుమార్ ను 2 కోట్ల 28 ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్నారు. అమీర్ ఖాన్ ను 2. 24 ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తున్నారు. హీరోయిన్స్ లో దీపిక ప‌దుకోణ్ అంద‌రికంటే ముందు వుంది. దీపిక‌ను 2 కోట్ల‌, 21 ల‌క్ష‌ల మంది అనుస‌రిస్తున్నారు. ఆ త‌రువాత స్థానంలో బాలీవుడ్ హీ మెన్ హృతిక్ రోష‌న్ ను 2 కోట్ల‌, 9 ల‌క్ష‌ల మంది ఫాలో అవుతున్నారు. సినిమా వారికి సంబంధించినంత వ‌ర‌కు కోట్ల‌లో ఫాలోవ‌ర్స్ ఉన్న ఒక్క తెలుగు సెలిబ్రిటి కూడా లేక పోవ‌డం విశేషం. బాహుబ‌లి తో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్ర‌భాస్ ని కూడా ల‌క్ష‌ల్లో మాత్ర‌మే అనుస‌రిస్తున్నారు.

ఇక అమితాబ్ ట్విట‌ర్ ను త‌న సెల్ఫ్ ఛానెల్ గా ఉప‌యోగిస్తుంటారు. సినిమాల‌కు సంబంధించిన విష‌యాలే కాకుండా..త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు మీద , పాలిటిక్స్ గురించి ట్విట్స్ చేస్తుంటారు. మిగిలిన ఫిల్మ్ సెలిబ్రిటీస్ లో ఎవ‌రు అమితాబ్ అంత యాక్టివ్ గా ట్విట‌ర్ ను ఉపయోగించరు . అప్ప‌డప్పుడు సినిమాల మీద త‌మ అభిప్రాయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంటారు.