Amitabh Bachchan re-birth Coolie accident, Amitabh Bachchan re-birth Coolie Movie accident, Amitabh re-birth Coolie accident Social Media Buzz‘కూలీ’ చిత్రంలో తన తండ్రి దుప్పటి కప్పుకునే సీన్ ను ఇంట్లో చేసేందుకు తాను ప్రయత్నిస్తుండేవాడినని చెబుతూ… లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1982 లో అమితాబ్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు జులై 26వ తేదీన బిగ్ బీ తీవ్ర ప్రమాదానికి గురికావడం, కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించడంతో, ఆగస్టు 2వ తేదీ నాటికి విషమ పరిస్థితి నుంచి అమితాబ్ బయటపడ్డారు.

ఆ తర్వాత క్రమంగా కోలుకుని కూలీ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. అందుకే, ఆగస్టు 2వ తేదీ అమితాబ్ కు పునర్జన్మ లాంటింది. ఈ నేపథ్యంలో అభిమానులు అమితాబ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్ట్ లు చేశారు. ఈ పోస్ట్ లకు బిగ్ బీ కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో చేసిన ఒక పోస్ట్ లో ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘కూలీ’ చిత్రంలో ఈ సీన్ గుర్తు చేసుకుంటూ ‘హ్యాపీ బర్త్ డే పా… నువ్వే నా స్ఫూర్తి’ అని పేర్కొన్నాడు.