amitabh bachchan cameo nagarjuna - ram gopal varmaసెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ – కింగ్ నాగార్జున కాంభినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘శివ’ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారనేది లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్.

అవును… వర్మకు – బిగ్ బీకి ఉన్న సాన్నిహిత్యంతో పాటు, నాగార్జునతో ఉన్న అనుబంధం రీత్యా, ఈ సినిమాలో ఓ పాత్రను అమితాబ్ చేత పోషిస్తున్నారనే న్యూస్ ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ ‘మనం’ సినిమాలో కూడా బిగ్ బీ ఓ చిరు పాత్రను ధరించిన విషయం తెలిసిందే. నటించింది ఒక్క సీనే అయినా, ప్రాధాన్యత ఉన్నది కావడంతో, ‘మనం’కు బాగానే వర్కౌట్ అయ్యింది.

ఇప్పుడు అదే కాంబోను మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నారన్న న్యూస్ ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో గానీ, ఈ సినిమాకు హైప్ పెంచడానికి మాత్రం బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అమితాబ్ ఉంటున్నారు కాబట్టి, బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను తీసుకువెళ్తారా? లేదా? అన్నది అసలు విషయం. గతంలో ఉన్న టాలీవుడ్ – బాలీవుడ్ మధ్య దూరం రానూ రానూ తగ్గుతోందన్న భావన అయితే స్పష్టం.