Amit Shah - Telangana - GHMC Elections 2020కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం చివరి రోజున హైదరాబాద్ వచ్చారు. దేశంలోనే లా అండ్ ఆర్డర్ విషయంలో అత్యంత బాధ్యతాయుతం గా ఉండాల్సిన పదవిలో ఉన్న ఆయన ఛార్మినార్ దగ్గరలోని భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం విశేషం.

హైదరాబాద్ లో అనేక దేవాలయాలు ఉండగా ఛార్మినార్ ని అనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లడంలో విశేషం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల ప్రచారమంతా హిందూ ముస్లిం… తెరాస ఎంఐఎం పొత్తు అంశాల మీదే బీజేపీ ఎన్నికల ప్రచారమంతా సాగింది.

దానిని బలపరిచేలా అమిత్ షాని కూడా కమ్యూనల్ గా బాగా సెన్సిటివ్ ప్రాంతమైన పాత బస్తి కి వెళ్లారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి బీజేపీ ఇటువంటి కవ్వింపు చర్యలకు దిగుతుందని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో ఐటి హబ్ కు అవసరమైన ప్రాధమిక సదుపాయాలు కల్పించామని అయినా తెరాస ఎంఐఎంలు అబద్దాలు చెబుతున్నాయని ఆరోపించారు.

అది నిజమే అయితే హైదరాబాద్ లో వరదల వల్ల ఏడు లక్షల మంది ఎలా ఇబ్బంది పడ్డారని ఆయన ప్రశ్నించారు. వరదలు వచ్చి ప్రజలలో కష్టాలలో ఉన్నప్పుడు కెసిఆర్ ఎందుకు ఆ ప్రాంతాలలో పర్యటించలేదని ఆయన ప్రశ్నించారు. అయితే వరదల వల్ల ఇబ్బంది పడిన ప్రజలకు కేంద్రం ఏం చేసింది? కనీసం పది రూపాయిలు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు కోసం వచ్చి కబుర్లు చెబుతున్నారు.