Amit shah rejected appointment o somu veerrajuవిశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఆంధ్రప్రదేశ్ బీజేపీని పూర్తిగా ఇరకాటంలోకి నెట్టేసింది. సొంత ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక అదే సమయంలో ప్రజలను ఎదురుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా ఏదో చేస్తున్నాం ప్రైవేటీకరణను ఆపడానికి అన్నట్టు ఢిల్లీ వెళ్లి హోమ్ మంత్రి అమిత్ షా కలవడానికి ప్రయత్నించారు.

అయితే అక్కడ వారికి చుక్కెదురు అయ్యింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో షా బిజీగా ఉన్నారని వారికి అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ను కలిశారట. అక్కడ ఇంకా పెద్ద షాక్ ఎదురయ్యిందట.

పార్టీ విషయాల గురించి వచ్చి మాట్లాడండి కానీ ప్రభుత్వ పాలసీ విషయాలలో వేలు పెట్టవద్దని ఆయన గట్టిగా హెచ్చరించారంట. దానితో బిక్కమొహం వేసుకుని తిరుగుప్రయాణం అయ్యారు నేతలు. ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలను కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు తీసిపారేశారు అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

మరోవైపు… తాము కూడా ప్రైవేటీకరణ ను అడ్డుకోవడానికి ఏదో చేస్తున్నాం అని చెప్పుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా సిద్ధం అవుతుంది. రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, లోకల్ లీడర్లు కలిసి విశాఖలో రేపు పాదయాత్ర చెయ్యబోతున్నారు. ఆ తరువాత ఒక భారీ బహిరంగసభ పెట్టి తమ ప్రసంగాలతో ఊదరగొడతారట.