Amit Shah Over confidence on Karnataka Electionsకర్ణాటకలో ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు కర్ణాటక అభివృద్ధి కోసం రూ.3లక్షల కోట్ల కేటాయింపే తమ గెలుపునకు సోపానాలని ఆయన పేర్కొన్నారు.

దాని అర్ధం బీజేపీకి సొంతగా మెజారిటీ వస్తాదనో, పొత్తులు ఏమీ ఉండవనో అంటే పర్లేదు. లేకపోతే గోవాలో, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో లాగా పక్కపార్టీల వారిని బీజేపీలోకి లాక్కోరు కదా? ఒకప్పటి బీజేపీ అయితే ఇలాంటి అనుమానాలు రావు ఇప్పటి బీజేపీకి మాత్రం గెలుపు కోసం ఏదైనా కరెక్టు అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.

కర్ణాటకలోని 223 నియోజకవర్గాలకు ఎన్నికలు ఈ నెల 12న జరగబోతున్నాయి. ఒక నియోజకవర్గ ఎన్నిక అభ్యర్థి దుర్మరణంతో వాయిదా పడింది. 15న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. సాధారణ ఎన్నికలకు కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉండడంతో ఈ ఫలితాల ప్రభావం పార్టీలపై గట్టిగానే ఉండబోతున్నాయి.